తుంటి ఎముక గాయంతో ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్లోని తన పాత నివాసానికి వెళ్లనున్నారు. కాగా కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడగా తుంటి ఎముకకు గాయమై హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. అయితే కేసీఆర్ పూర్తిగా కోలుకోవటానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.
