తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన మూడు రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగింది. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 17 తర్వాత ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోవటంతో చలి తెల్లవారుజామున తీవ్రస్థాయిలో ఉంటోంది.
