కోలీవుడ్‌లో చేసిన తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఇటీవల ఆయన హీరో విజయ్‌తో కలిసి ‘లియో’ సినిమాను తీశారు. ఈ సినిమా గురించి ‘ఫైట్‌క్లబ్’ ప్రమోషన్స్‌లో లోకేశ్ స్పందించారు. లియో సెకండాఫ్ అంతగా బాలేదంటూ కామెంట్స్ చేశారని, వాళ్ల మాటలను నేను స్వీకరిస్తున్నా అని తెలిపారు. ఇకపై ఏదైనా చిత్రం ప్రారంభంకాగానే, దాని రిలీజ్ డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయనని తెలిపారు.
