ఇకపై ఇరాన్‌లో పర్యటించాలనుకునే భారతీయులకు వీసా అవసరం లేదు. ఈ మేరకు ఆ దేశ సర్కారు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మొత్తం 32 దేశాలకు వీసా నుంచి మినహాయింపు ఇచ్చినట్లు టెహరాన్ ప్రకటించింది. ఇరాన్‌పై ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తలకు ఇప్పటికే వీసా రహిత ప్రవేశం ఉండగా, ఇకపై సామాన్య పౌరులకూ అది వర్తించనుంది.
