తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చూస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివినట్లు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. “గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదు. గత పదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించింది.” అని కడియం పేర్కొన్నారు
