నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి టార్గెట్ అయ్యింది. ఇటీవలే ఒక డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది. అందులో నటించింది తాను కాదని తేలిసింది. అయితే మరోసారి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేస్తోంది.
గత వీడియోకన్నా ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. దీనిపై ఆమె అభిమానులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటివాటిని ఆపకపోతే బాగుండదంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. వరుస హిట్ సినిమాలతో సినిమా పరిశ్రమను రష్మిక షేక్ చేస్తున్న తరుణంలో ఈ తరహా సంఘటనలు ఎదురుకావడం బాధాకరమని చెప్పాలి. వీటిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తాజాగా యానిమల్ చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక మందన్నా. పుష్ప చిత్రంతోనే పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. యానిమల్ చిత్రంతో దాన్ని మించిన ఇమేజ్‌ని సంపాదించింది. అల్లు అర్జున్ పుష్ప2 లో నటిస్తోంది. మరో సారి శ్రీవల్లిగా సందడి చేయబోతోంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించింది.
దీంతోపాటు రెయిన్ బో అనే సినిమా చేస్తోంది. అలాగే యానిమల్ పార్క్‌లోనూ త్వరలోనే జాయిన్ కాబోతోంది. మొత్తానికి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ తరహా వీడియోలు వీరి ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు అనే విధంగా అద్భుతమైన సినిమాలను ఎంపిక చేసుకుంటోంది రష్మిక మందన్నా.