అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర దర్శనం కోసం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణె, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ వంటి ప్రధాన నగరాల నుంచి యాత్రికుల కోసం అయోధ్యకు నడుస్తాయి.
