ఏజెంట్లకు చెల్లించే గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తెలిపింది. ఏజెంట్లు, ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదనను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది.
