పార్లమెంటు భద్రత ఘటనపై ఎంపీలందరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంలో ఇద్దరు నిరసన కారులు గ్యాస్ డబ్బాలతో పొగను వెదజల్లిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు.
లోక్ సభలోకి దుండగులు ప్రవేశించడం అనేది భద్రతా వైఫల్యానికి నిదర్శనమేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పక్కా కార్యాచరణతో ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో పేర్కొన్నారు.