కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతుబంధు పథకాన్ని భూస్వాములు, బడా వ్యాపారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపి వేసే దిశగా కసరత్తు చేస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రైతుబంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే రైతబంధు వర్తించేలా మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించినట్లుగా సమాచారం.
