లింగ అసమానతలపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అసమానతలను పరిష్కరించేందుకు చట్టాలు అవసరమని అన్నారు. అయితే, హక్కుల ఉల్లంఘనకు గోప్యత సాకు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్‌లో సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకటరామయ్య స్మారకార్థం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు డీవై చంద్రచూడ్ ఆదివారం హాజరై మాట్లాడారు.
