హైదరాబాద్ లో ఉన్న పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లల్లో పోలీసులు సోదాలు నిర్వ హించారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లోని ఓపెన్ బార్స్ కిచెన్స్, మాక్టైల్స్ , 15 పబ్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లోని హాలోపబ్ లో పోలీసులు సుమారు 3 గంటలపాటు తనిఖీలు చేశారు.
హైద్రాబాద్ సీపీ ఆదేశాలతోనే తనిఖీలు చేశామని పోలీసులు అన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి డ్రగ్స్ స్టోరేజ్ ఉంటుందన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వ హించామని తెలిపారు. పోలీసులు స్నీపర్ డాగ్స్ ను తీసుకువెళ్లి తనిఖీలు చేశారు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. మొదటిసారి స్నీపర్ డాగ్స్ ను వెంటబెట్టుకొని పోలీసులు సోదాలు నిర్వహించారు.