UPDATES  

 నా సామిరంగ’ టీజర్ రిలీజ్.. అదిరిపోయిన సర్‌ప్రైజ్..

టాలీవుడ్ నవ మన్మథుడు..కింగ్ నాగార్జున.. ఆరు పదుల వయసులో కూడా యమ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు నా సామిరంగా అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఏ మూవీలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది.డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి బరిలో సాలిడ్ హిట్టు కొట్టాలి అనే ఉద్దేశంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా ఎంతో వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ప్రతి క్యారెక్టర్ ని ఒక పోస్టర్ ద్వారా రివిల్ చేయడమే కాకుండా ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి అంజి పాత్రలో అల్లరి నరేష్ కు సంబంధించి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ వీడియో బాగా ఆకట్టుకున్నాయి. మాటొచ్చేత్తది..అనే ట్రేడ్ మార్క్ డైలాగ్ తో.. మాస్ స్టెప్స్ తో.. అల్లరి నరేష్ అంజి గాడి పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ నుంచి ఈరోజు విడుదల చేసిన టీజర్ అందరిని సర్ప్రైజ్ చేస్తోంది.

 

సంక్రాంతి పండక్కి వస్తున్న ఈ మూవీ నిజంగానే పండగ వాతావరణం తన తోటి తీసుకువస్తుంది అన్న విషయం ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో..పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే ఇందులో ముగ్గురు హీరోలు ఉన్నారు అని అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఉన్న విషయం అందరికీ తెలుసు.. అయితే టీజర్ వచ్చిన తర్వాత ఈ మూవీలో ఇంకొక హీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు అన్న విషయం అర్థమైంది.

 

ఏ మూవీలో అల్లరి నరేష్ కు జంటగా..మిర్నా మీనన్ నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ పాత్రకు జంట ఎవరు అన్న విషయం ఇంకా రివీల్ కాలేదు. ఇక టీజర్ లో నాగార్జునకు ఒకరేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో పాటు.. మూవీలో కామెడీ సీన్స్ తో పాటు లవ్ సీన్స్ కూడా బాగా ఉన్నాయి అన్న విషయం కన్వే చేశారు. మొత్తానికి పండక్కి గట్టి కంటెంట్ తో వస్తున్న నాగార్జున పోటీ ఎంతవరకు తట్టుకుంటాడో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !