మాస్ మహారాజ్ గత కొద్దిరోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ధమాకా ,వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ అందించినా ..ఆ తర్వాత వచ్చిన రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీకి మిస్టర్ బచ్చన్ అనే ఒక మంచి మాస్ టచ్ తో ఉన్న పవర్ ఫుల్ టైటిల్ ను సెలెక్ట్ చేశారు.
‘నామ్ తో సునా హోగా’ అనే టాగ్ లైన్ తో విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మిరపకాయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న ఈ మూవీ .. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఒక పాతకాలం స్కూటర్ పై ఎంతో స్టైల్ గా పోజిస్తూ కూర్చున్న రవితేజ ఫోటోని ఈ పోస్టర్లో జోడించారు.
కళ్ళకి షేడ్స్ ధరించి క్లాస్ గెటప్ లో మాస్ మహారాజ్.. చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇక పోస్టర్ వెనుక బ్యాక్ డ్రాప్ లో ఐకానిక్ నటరాజ్ థియేటర్ ఉంది. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టుగా.. ఇందులో రవితేజ అమితాబచ్చన్ పోలికలతో కనిపిస్తున్నాడు. ఇక మాస్ మహారాజ్ ఇన్ అండ్ యాజ్ అని పోస్టర్లో మెన్షన్ చేశారు దీన్ని బట్టి అమితాపాత్రలో రవితేజ నటిస్తున్నాడు అని అనుకోవాలి. ఇక మాస్ మహారాజ్ ఈ కొత్త లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతానికి పోస్టర్ మూవీ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ మూవీ అయినా రవితేజ ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ అతనికి అందిస్తుందని ఆశిద్దాం.