చాలా రోజుల తర్వాత మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య 277 శాతం పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేరళలో గత వారం 111 యాక్టివ్ కేసులు ఉండగా.. వాటి సంఖ్య ఒక్కసారిగా 1,634కి చేరింది. వీటిలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ జనాలను భయపెడుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.