శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా తాళ్లను కట్టిన పోలీసులు.. గంటల తరబడి భక్తులను నిల్చోబెట్టారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు ఉన్నారని.. ఎంత సేపు నిల్చోవాలంటూ అయ్యప్ప భక్తులు నిలదీయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని వాపోతున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు తగు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించడం లేదని వాపోతున్నారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తుండగా.. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం పడుతున్నట్లు వెల్లడించారు.