రాబోయే నూతన సంవత్సరం వేడుకల పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. న్యూయర్ వేడుకలకు నిర్వాహకలు పది రోజులు ముందుగానే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ రాత్రి 1 గంటకు లోపు ముగించాలని ఆదేశించారు. ఈవెంట్ నిర్వహించే చోట భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయ్యాలని సూచించారు.
ఈవెంట్ జరిగే ప్రదేశాలలో భద్రత సిబ్బందిని నియమించాలని తెలిపారు.కెపాసిటీ కు మించి పాస్ లు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ ఈవెంట్స్ నిర్వహించే చోట మైనర్లకు అనుమతి లేదన్నారు. సమయానికి మించి మద్యం సరఫరా చేయరాదని పోలీసులు ప్రకటించారు . ఆశ్లీల నృత్యాలకు అనుమతి లేదని సృష్టం చేశారు. ఈవెంట్ లు నిర్వహించే ప్రదేశాలలో శబ్ధం 45 డెసిబుల్స్ కి మించవద్దని ఆదేశించారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.