అశ్వాపురం:—అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను అశ్వాపురం పోలీసులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం వద్ద గల గోదావరి నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మూడు లారీల్లో ఇసుకను,తరలిస్తున్న సమయంలో అశ్వాపురం పోలీసులు గొల్లగూడెం బ్రిడ్జి వద్ద లారీలను నిలిపి పత్రాలను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు.పట్టుబడిన మూడు లారీలను స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు*