మన్యం న్యూస్ చర్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ మరిపట్ల లో అన్ని జిల్లాల లో ఉన్న ఈఎంఆర్ఎస్ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో సత్తా చాటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ.ఎం.ఆర్.ఎస్ చర్ల విద్యార్థిని విద్యార్థులు. అండర్ 17 ఏజ్ కేటగిరి పురుషుల విభాగంలో వాలీబాల్ ప్రథమ స్థానం, ఫుట్బాల్లో ద్వితీయ స్థానం, బాక్సింగ్ లో ప్రథమ స్థానం, లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం ఆర్చరీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ లో ప్రథమ స్థానముగా ప్రథమ స్థానముగా నిలబడ్డ ఈఎంఆర్ఎస్ చర్ల విభాగం విద్యార్థులు అనంతరం ఈఎంఆర్ఎస్ జాతీయస్థాయి మైసూర్లో జరిగే క్రీడలకు ఎంపిక చర్ల విద్యార్థులు కె అజయ్ కుమార్, బి రూప,ఈ మోహన్,పి రాధాకృష్ణ, బి శశిధర్, వి జితేందర్, ఎస్ అజయ్ తేజ, ఎం భరత్ చంద్ర,కే పార్ధు, కె శ్రీవల్లి, ఎస్ శ్రీవిద్య, వాణిశ్రీ, రా హరి, మోక్ష శ్రీ, దివ్యశ్రీ, శ్రావణ్ కుమార్, నందిని,హర్షిత,పావని లు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఈ నవీన్ నికోలస్, డీఎస్ డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, స్పోర్ట్స్ అధికారి వీర్యా నాయక్, స్కూలు ప్రిన్సిపాల్ ఎం శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ ఈ జ్యోతి, ఆర్ సి ఓ వెంకటేశ్వర్లు, ఏ పీ ఓ డేవిడ్ రాజ్ లు క్రీడలకు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.