మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో అర్ధరాత్రి కిరాణా షాపులో దొంగలు పడి లక్ష ఇరవై వేల రూపాయల నగదును అపహరించక పోయారు. మర్కోడు గ్రామానికి చెందిన నడం మల్లికార్జున్ కిరాణా షాపులో తాళం పగలగొట్టి లక్ష ఇరవై వేల రూపాయలను చోరీ చేసినట్లు యజమాని పేర్కొన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. కిరాణా షాపులో సిసి ఫుటేజ్ ఉండడంతో పోలీసులు పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న
