మన్యం న్యూస్ గుండాల: మండలంలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లు హస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొన్ని సెంటర్లకు సూపర్వైజర్లు వెళ్లక పోవడంతో అక్కడ పనిచేస్తున్న టీచర్స్ సమయపాలన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. దీనికి తోడు అంగనవాడి సరుకులు సైతం సరైన సమయంలో ఇవ్వకపోగా అడిగిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. అంగన్వాడి సెంటర్లో సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకొని పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు సరైన పోషకాహారం అందే విధంగా అధికారులు చొరవ చూపాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు
