మన్యం న్యూస్ గుండాల: రామనామ స్మరణతో గుండాల మండల కేంద్రం మార్మోగింది. అయోధ్య నగరం నుండి వచ్చిన రాముడు అక్షింతలను గుండాల మండల కేంద్రంలోని ప్రధాని కోడలి గుండా అయ్యప్ప స్వాములు రామనామ కీర్తనలతో ఊరేగింపుగా రామాలయానికి తీసుకువచ్చారు. జనవరి 24వ తారీఖు రామ మందిరం అయోధ్యలో అట్టహాసంగా ప్రారంభం కానున్న రాముడి అక్షింతలు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో భారీగా ఊరేగింపు చేసి వాటిని రామాలయాలకు చేరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు యాసారపు రవి, గుండెబోయిన నాగరాజు, తవ్డోజు సురేష్.మానాల ఉపేందర్, అయ్యప్ప స్వాములు శ్రీను, పిల్లి కృష్ణ, వెలిశాల నరేష్, యాసారపు యాకయ్య, శ్యామ్, సనత్ కుమార్, గ్రామస్తులు మానాల శ్రవణ్ కుమార్, ఇల్లందుల అప్పారావు, వల్లోజి సాగర్ తదితరులు
