కోవిడ్ కొత్త ఉపరకం జేఎన్.1పై సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. దీని కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటి వరకు సుమారు 400కు పైగా ఉపరకాలను గుర్తించాం. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి’ అని తెలిపారు
