ఈ నెల 30వ తేదీ నుంచి న్యూఢిల్లీ-అయోధ్య మధ్య అమృత్ భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ కొత్త రైలులో రెండు వైపులా ఇంజిన్లు ఉండటమే కాక రైలు మొత్తం నాన్ ఏసీగా రూపొందించారు. జనరల్ సీట్లతో పాటు రిజర్వుడ్ సిట్టింగ్ స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. ఈ రైలుకు 22 బోగీల్ని ఏర్పాటు చేస్తారు. ఈ రైలు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
