JN.1 వేరియంట్ సోకిన వారు కరోనా వ్యాక్సిన్ ఎక్స్‌ట్రా డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని కొవిడ్ ప్యానెల్ చీఫ్ డా.ఎన్‌కే.అరోరా తెలిపారు. ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. JN.1 వైరస్ సోకిన వారు 2-5 రోజుల్లో కోలుకునే అవకాశముందని చెప్పారు.
