రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఓటీటీ విడుదలపై దర్శకుడు సందీప్‌రెడ్డి స్పందించాడు. ‘మూవీ రన్ టైమ్ మూడున్నర గంటలు. ఒత్తిడితో తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేసి.. 3.21 గంటల నిడివితో థియేటర్లో విడుదల చేశాం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వెర్షన్‌ను ఎడిటింగ్ చేస్తున్నా. తొలగించిన షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నా’ నని తెలిపారు.
