దేశవ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63 జేఎన్.1 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో గోవాలోనే అత్యధికంగా 34 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి.
