UPDATES  

 హైదరాబాద్‌ క్రికెట్ టీమ్‌ను సొంతం చేసుకున్న రామ్‌ చరణ్‌.. త్వరలోనే లీగ్..

ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై తన పవర్‌ ఎంటో చూపించారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. ఇప్పటికే అనేక వ్యాపార రంగంలో తన సత్తా చాటుతున్న రామ్ చరణ్‌ ఇప్పుడు స్పోర్ట్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌ని ఆయన సొంతం చేసుకున్నారు. చరణ్‌తో పాటు అక్షయ్ కుమార్.. శ్రీనగర్ టీమ్‌ని, హృతిక్ రోషన్ బెంగళూరు టీమ్‌ని, అమితాబ్ బచ్చన్ ముంబైని సొంతం చేసుకొని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యారు.

 

క్రికెట్‌లో ఐపీఎల్‌లాగానే మరో సెన్సెషన్‌ను ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. టీ టెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఇన్ని రోజులు వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లు ఇప్పుడు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయటానికి పలు టీమ్స్‌ని ఇలా స్టార్స్‌ సొంతం చేసుకోవటం విశేషం. ఈ లీగ్‌లో టెన్నిస్‌ బాల్‌తో పది ఓవర్ల మ్యాచ్‌ ఆడనున్నారు.

 

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబైలో జరగనుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, శ్రీనగర్.. మొత్తం ఆరు టీమ్స్‌ మధ్య 19 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అండర్ 19 ఏజ్ గ్రూప్ కేటగిరీ నుంచి కనీసం ఒక ఆటగాడిని చేర్చుకోవడం మినహా.. ఇందులో ఎలాంటి వయసు పరిమితులు లేవు.

 

ISPLలో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు రామ్ చరణ్‌. హైదరాబాద్ టీమ్‌ను సొంతం చేసుకోవటం తెలియని ఆనందాన్ని కలిగిస్తుందని.. మన నగరానికి క్రికెట్ ఆటపై ఉన్న ఆసక్తిని ప్రదర్శించడానికి ఇదొక గొప్ప వేదిక అన్నారు ఆయన.

 

ఈ లీగ్‌లో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు ISPL అధికారిక వెబ్ సైట్‌లో రిజిష్టర్ చేసుకుని సిటీ ట్రైయల్స్‌లో పాల్గొనటానికి గోల్డెన్ టికెల్ అవకాశాన్ని దక్కించుకోవాలి. ట్రయల్స్ జరగబోయే ప్రాంతం, దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !