మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాలోని ఆదివాసీలకు హైదరాబాద్ కు చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్చంద సంస్ద ఆద్వర్యంలో రగ్గులు, చలి కోట్లను అందచేసారు. మండలంలోని మారుమూల అటవీప్రాంత గ్రామాలయిన చెన్నాపురం, ఎర్రంపాడు, రాళ్లాపురం, కందిపాడు గ్రామాలకు చెందిన 350 కుటుంబాలకు రగ్గులను అందచేసారు. వనవాసీ కళ్యాణ పరిషత్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం లో రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిదులు రగ్గులను గిరిజనులకు అందచేసారు. అనంతరం చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు చెందిన 26 మంది విద్యార్దులకు చలి కోట్లను అందచేసారు. హైదరాబాదులో పలువురు దాతల నుండి సేకరించిన విరాళాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. గతంలో జిల్లాలోని పినపాక, కరకగూడెం మండలాలలో సైతం తమ సంస్ద ద్వారా గిరిజనులకు సోలార్ దీపాలు, దుస్తులను అందచేసినట్లు రాబిన్ హుడ్ ఫ్రతినిదులు వెల్లడించారు. ఇక్కడి గిరిజనులు తమపట్ల చూపిన ప్రేమాబిమానాలు ఎన్నటికి మరిచిపోలేనిదనని, వారు ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.