మన్యం న్యూస్ దుమ్ముగూడెం డిసెంబర్ 26::
రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రజాపాలన పేరున ప్రజల వద్దకు వస్తున్నందున,వివిధ సమస్యలపై,ప్రజలు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని సమస్యల పరిష్కారానికీ కృషిచేయాలని తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు పిలుపునిచ్చారు.గత తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రజల వద్దకు పాలన పచ్చదనం,పరిశుభ్రత.. జన్మభూమి లాంటి ప్రజారంజక కార్యక్రమాలు చేపట్టి అనేక వినూత్న కార్యక్రమాలు ప్రజలకు అందించారని గత15సంవత్సరాల తరువాత, ప్రజల్లోకి ప్రభుత్వం,వస్తున్నందున మండలంలోని ఉన్నటువంటి మొండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.