సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహాం’ సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు లాయర్ కోరగా.. కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
