‘సలార్’ సినిమాలో గిరిజన గూడానికి చెందిన అమ్మాయి ‘సురభి’ని చెరబట్టడానికి వచ్చిన ఒక దొర కొడుకును హీరో అంతం చేయడం అనే సీన్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుని వెళుతుంది. ‘సురభి’ పాత్రలో కనిపించిన ఫర్జానా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ .. “ప్రశాంత్ నీల్ గారు నన్ను ప్రభాస్‌కి పరిచయం చేశారు. ప్రభాస్ గారిని చూడగానే నాకు చాలా భయమేసింది. కానీ ఆయన చాలా కూల్‌గా మాట్లాడటంతో కంగారు తగ్గిపోయింది’ అని చెప్పింది.
