విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం సైంధవ్, హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తోంది సైంధవ్ టీం. ఈ మూవీ వెంకటేశ్ కు 75వ సినిమా కావడంతో పాటు హిట్ సిరీస్‌తో రెండు హిట్లు చేసిన శైలేష్ కొలను దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి.
