మన్యం న్యూస్ గుండాల: అయ్యప్ప నామస్మరణతో గుండాల మండల కేంద్రం మార్మోగింది. నగర సంకీర్తనలతో అయ్యప్పను డప్పు వైద్యాల నడుమ భారీ ఊరేగింపుగా పడిపూజ కార్యక్రమం వద్దకు తీసుకువచ్చిన అయ్యప్ప స్వాములు. మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు,ప్రమీల రాణి, వారి కుమారుడు, కోడలు మానాల ప్రణీత్ కుమార్, యశస్విని, కూతురు అల్లుడు తాటిపల్లి నరసింహారావు, నాగ సుధా ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భజనలు పూజలతో వారి ప్రాంగణం మారుమోగింది. ఈ పడిపూజ కార్యక్రమానికి వివిధ గ్రామాల స్వాములతో పాటు మండల కేంద్రంలోని అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
