- ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఇసుక దొంగలు.
- తప్పు త్రోవ పడుతున్న ఇసుక పాలసీ
- గిరిజన సొసైటీ పై రేసింగ్ కాంట్రాక్టర్లదే హవా
- దోచుకున్నోడికి దోచుకున్నంత
- శూన్యంగా టిఎస్ఎండిసి అధికారుల పర్యవేక్షణ
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం
వెంకటాపురం మండల కేంద్రంలో చింతలగూడెం కే కొండాపురం, శ్రీరంగాపురం గ్రామంలో గిరిజనులకు ఉపాధి కొరకు ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ రేసింగ్ కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మ అయింది.
గిరిజనుల పేరుతో రేసింగ్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక విక్రయాలు జరుపుతూ మన్యం బిడ్డలని మభ్యపెట్టి పెద్ద మిషనరీలతో ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు వెంకటాపురం మండల కేంద్రంలో చింతగూడెంలో శ్రీరంగాపురం కే కొండాపురంలో నెలకొన్నాయి.
పర్యవేక్షించాల్సిన టిఎస్ఎండిసి అధికారులే దీనికి కొమ్ము కాస్తున్నారు అని పలు ఆరోపణలు ఉన్నాయి.
రెగ్యులేషన్ 31 ఏ ప్రకారం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరం . ఇది పూర్తిగా గిరిజ నేతరులకు సంబంధం లేని విషయం. అయితే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఈ గిరిజన సొసైటీలను పూర్తిగా వినియోగించుకోవాల్సిన చట్టం. ఒకవేళ గిరిజనుడు గిరిజన
సొసైటీని నడిపించలే ని క్రమంలో టిఎస్ఎండిసి ప్రభుత్వ అధికారులు గిరిజనులకు ట్రాక్టర్లు సంబంధించిన మిషనరీలు గిరిజనులకు ఇచ్చి. ఎలా చేయాలో నేర్పించి మరి వారు విక్రయించే ఇసుకను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే
దానికి విరుద్ధంగా ఏజెన్సీలో ఇసుక ర్యాంపులు నడుస్తున్న.
టిఎస్ఎండిసి అధికారుల
పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతున్నాయి. నిజానికి
ఈ ఏజెన్సీ ప్రాంతంలో
రేసింగ్ కాంట్రాక్టర్లకు ఏ ఒక్కదానిమీద అధికారము ఉండదు పరోక్షంగా నైనా వారు విక్రయాలు కార్యకలాపాలు చేయకూడదని ఫిఫ్త్ షెడ్యూల్ పెసా చట్టాలు చెబుతున్నా . చట్టాల మీద ఏ మాత్రం పట్టింపు లేని రైజింగ్ కాంట్రాక్టర్లు , యదేచ్ఛగా విక్రయాలు జరుపుతూ రాత్రి పగలు ఆని తేడా లేకుండా గిరిజనులకు అందవలసిన లబ్ధిని వీరి పొందుతూ. సొమ్ము చేసుకుంటు వాళ్లకు చేకూరే ఉపాధికి గండి కొడుతున్నారు. ఇంకా గొప్ప విషయము టిఎస్ఎండిసి అధికారులే రేసింగ్ కాంట్రాక్టర్లతో మూకుమ్మడి ఒప్పందం చేసుకొని తూతూ మంత్రంగా పర్వేక్షించుతున్నారని పలారోపణలు నెలకొంటున్నాయి. వీళ్ళు చేసే లీగల్ దోపిడీలను చూస్తే వీళ్లు చేసేదే నిజమేమో అని కొంతసేపు న్యాయవాదులు సైతం మళ్లీ చట్టాలను చూడవలసిన పరిస్థితులు కల్పిస్తున్నాయి..
ఈ విషయం పట్ల పాత్రికేయులు ఎవరైనా అడిగితే వారి మీదనే దాడులకు దిగిన ఘటనలు కూడా శ్రీరంగాపురం చింతలగూడెం గిరిజన సొసైటీలో జరిగిన దాఖలలు కూడా ఉన్నాయి. ఇలా
అడుగడుగునా పై అధికారుల పర్యవేక్షణ, తప్పులు కనబడుతున్న ఈ నేపథ్యంలో కలెక్టర్ అయినా ఈ గిరిజనుల కొరకు ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ పట్ల కఠినమైన నిర్ణయం తీసుకొని ఇసుక పాలసీని పటిష్టం చేయవలసిందిగా యావత్ మండల ప్రజలు పత్రిక ముఖంగా కోరుతున్నారు.