డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మోసపూరిత లోన్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయవద్దని కేంద్రం కీలక సూచలను జారీ చేసింది. ఈ లోన్ యాప్‌లకు చెందిన ప్రకటనలను చాలా సోషల్ మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని, ఇవి ఇంటర్నెట్ యూజర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. ఈ మేరకు యూట్యూబ్, ట్విటర్‌తోపాటు ఇతర సోషల్ మీడియాలలో వీటిని ప్రసారం చేయవద్దని సూచించినట్లు తెలిపారు.
