మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలోని ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామనాథం మాట్లాడుతూ, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. ఆరు గ్యారెంటీ లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు అధికారుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి బషీరుద్దీన్, సీనియర్ నాయకులు పడిగ నాగయ్య, మహిళా నాయకురాలు గొంది రాధ, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు మదర్ సాహెబ్, సీనియర్ నాయకులు కొండేరు పుల్లయ్య, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, పొనుగోటి చందర్ రావు, జరుకుల రాము నాయక్, సుతారపు వీరన్న, యాలం బుజ్జిబాబు, పినపాక మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ అత్తె లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.