హాస్యబ్రహ్మ బ్రహ్మానందంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్ అవుతోంది. తన జీవిత కథను వివరిస్తూ బ్రహ్మానందం ‘నేను’ అనే పేరుతో ప్రచురించిన తన ఆటోబయోగ్రఫీ కాపీని తాజాగా చిరంజీవికి అందించారు. ఈ మేరకు చిరు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ‘40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తక రూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది’ అన్నారు.
