పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్ తప్పట్లేదు. పవన్ ‘ఓజీ‘ సినిమా నుంచి న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు భంగపాటు ఎదురైంది. ఏదైనా ఒక సాంగ్ లేదా కనీసం పవర్‌స్టార్ కొత్త పోస్టర్ అయినా వదలుతారని ఆశగా ఉండగా చిత్ర యూనిట్ చేసిన ప్రకటన నిరాశ కలిగించింది. కొత్త ఏడాది కానుకగా ఎలాంటి ట్రీట్ ఇవ్వట్లేదంటూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు.
