శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి మీరాబాయి(1498-1547) 525వ జయంతి సందర్భంగా కోల్‌కతా టంకశాల రూ.525 స్మారక నాణెం ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వెండి, రాగి, నికెల్, జింక్ మిశ్రమంతో ఈ నాణేన్ని రూపొందించారు. నాణేనికి ఒకవైపు మీరాబాయి చిత్రం, మరోవైపు భారత జాతీయ చిహ్నన్ని ముద్రించారు.
