మన్యం న్యూస్ భద్రాచలం:
ముంబైలో ఈనెల 21 నుంచి 25 వరకు జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పథకం సాధించిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు గాలి రామ్మోహన్ రావు ని, పట్టణంలోనే ప్రముఖ మీమ్స్ హాస్పటల్ కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ గురుతేజ్ సిటీ స్టైల్ జిమ్ సెంటర్లో సిటీ స్టైల్ జిమ్ సభ్యుల సమక్షంలో ఘనంగా సాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గురుతేజ మాట్లాడుతూ గాలి రామ్మోహన్ రావు ఇంటర్నేషనల్ పోటీలో కూడా వెళ్లి అక్కడ కూడా విజయం సాధించాలని అందరి ఆకాంక్ష అని అన్నారు . అట్లానే ఆయనకు శిక్షణ ఇచ్చినటువంటి జిమ్ కోచ్ జీవీ రామిరెడ్డి నీ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ పవర్ లిఫ్టిగ్ వెంకటకృష్ణాజీ , ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ గుగులోతు శోభ నాయక్ , ఓంశాంతి జ్యువెలర్స్ అధినేత పసగడ రాజేష్, సిటీ స్టైల్ జిమ్ సభ్యులు పాల్గొని అభినందించారు.