మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పినపాక మండలంలో ప్రారంభమైన ప్రజాపాలనా కార్యక్రమాన్ని ఏడూళ్ళ బయ్యారం సిఐ శివ ప్రసాద్ పలు ప్రాంతాలలో పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజల్లో పాల్గొన్నారు.