UPDATES  

 గ్యారంటీల పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీపీ రేగా కాళికా ..

  • గ్యారంటీల పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి.
  • ఎంపీపీ రేగా కాళికా
  • గ్రామాలలో సందడిగా ప్రజా పాలన గ్రామసభ,ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.

మన్యం న్యూస్ కరకగూడెం :ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రేగా కాళిక ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తాసిల్దార్ సంధ్య తెలిపారు.ప్రజాపాలన కార్యక్రమాన్ని కరకగూడెం మండల కెంద్రంలోని కన్నాయిగూడెం,సమత్ మోతే గొల్లగూడెం గ్రామపంచాయతీలో జరిగే ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి

6 గ్యారంటీ ల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో కరకగూడెం మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీ,లో ప్రజా పాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తులు ఉచితంగా ప్రజలకు ఇస్తున్నామని, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. దరఖాస్తులు జిరాక్స్ తీయుటకు నమమాత్రపు ధర తీసుకోవాలని చెప్పారు. ఎక్కువ వసూళ్లు చేస్తే కఠిన చర్యలతో పాటు పోలీస్ కేసు నమోదు సెంటర్ మూసివేస్తామని చెప్పారు. దరఖాస్తులు పూర్తి చేయుటకు అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు దళారులను నమ్మొద్దని ఎవరైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సలహాలు, సూచనలు కొరకు ప్రజాపాలన కేంద్రాల అధికారులను సంప్రదించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి, గొల్లగూడెం సర్పంచ్ విజయ్,ఎంపీడీఓ శేంకర్, డిప్యూటీ తహసిల్దార్ సంధ్య,అంగన్వాడీ సూపర్వజర్ భద్రమ్మ,ఏపీఎం, త్రిగున,అగ్రికల్చర్ ఏఈఓ అనిల్,పంచాయతీ కార్యదర్శి తరుణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, కార్యదర్శులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, సర్పంచులు ఉపసర్పంచులు ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !