శివ కార్తికేయన్ హీరోగా, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా, దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “అయలాన్”. ఏలియన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పొంగల్‌కు రిలీజ్ అని చెప్పిన మేకర్స్ స్పష్టమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ సినిమాను కూడా జనవరి 12నే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది
