UPDATES  

 అవి తప్ప నేనింకేం చేయలేను: రామ్ చరణ్..

చాలా మంది హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి ఎంతో మంది హీరోలు ఉన్నారు. వీరితోపాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నా.. తనను తాను చాలా వీక్‌గా చెప్పుకుంటున్నాడు. అంతేకాదు.. ఓ బ్యాడ్ బిజినెస్‌మేన్‌గా కూడా చరణ్ ఫీలౌతున్నాడు. ఇంతకీ ఏమైంది?.. ఎందుకలా ఫీలౌతున్నాడు అనే విషయానికొస్తే..

 

టాలీవుడ్‌కి చెందిన చాలామంది హీరోల్లానే చరణ్ కూడా గతంలో కొన్ని బిజినెస్‌లు చేపట్టాడు. అయితే అవేమి కలిసిరాలేదనే విషయాన్ని అతడు పరోక్షంగా వెల్లడించాడు. ‘‘సినిమాలు, మూవీ ప్రొడక్షన్‌కు సంబంధించి ఏ వ్యాపారాన్నైనా చేయడం నాకు ఇష్టమే. అవి తప్ప నేనింకేం చేయలేను. నేనో బ్యాడ్ బిజినెస్‌మేన్‌ని. నేను వ్యాపారవేత్తను కాదు. అంకెలతో డీల్ చేయడం నాకు రాదు. రెండు పడవలపై కాళ్లు పెట్టను. ఒకే పడవపై ప్రయాణించడం నాకిష్టం.. అదే యాక్టింగ్’’ అనే విషయాన్ని స్వయంగా చరణ్ వెల్లడించాడు.

 

ఇక సినిమాలకు సంబంధించి తన సొంత నిర్ణయాలతో ముందుకెళ్లానని చెబుతున్నాడు. అంతేగాక.. ఈ విషయంలో అందరూ చెప్పేది వింటాను.. కానీ చివరికి తనకి నచ్చిన నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు. ఇకపోతే ఆయన సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

 

ఇక ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై కూడా ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో అతడు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. అంతేకాకుండా ఇందులోని ‘జరగండి జరగండి..’ అనే ఓ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించారని.. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చరణ్.. దర్శకుడు బుచ్చిబాబుతో ఓ చిత్రం చేయనున్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !