మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేకంగా తయారు చేయించిన చందన హారాన్ని సీతక్కకి బహుకరించారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబ శివ రెడ్డి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలోని ప్రాసెస్ చేయబడిన సువాసన గల చందన హారాన్ని ఛిఫ్డ్ కలప స్వచ్ఛమైన గంధం నూనె మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమం జోడించి భారతీయ గ్రామీణ హస్త చందన కళాకారుల చేత ప్రత్యేకంగా రూపొందించిన సువాసన వెదజల్లుతున్న చందన హారాన్ని తెప్పించి తనకు ఎంతో ఇష్టమైన నాయకురాలు ములుగు జిల్లా ఆడబిడ్డ రాష్ట్ర మంత్రి సీతక్కకి నూతన సంవత్సర కానుకగా బహుకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చందన హారం విశేషాలను మరియు స్థానిక సమస్యలను సాంబశివరెడ్డిని అడిగి తెలుసుకున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని మంత్రి సీతక్క సాంబశివరెడ్డికి సూచించారు.