మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది 2024 అడుగుపెట్టనుంది. ఈ తరుణంలో ప్రముఖులు కొత్త సంవత్సరం శుభాకాంక్షలను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 2023 తనకు అందమైన, ముఖ్యమైన పాఠాలను నేర్పిందని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
