మన్యం న్యూస్, పినపాక :
మండలంలోని తోగ్గూడెం పంచాయతీ తోగ్గూడెం గ్రామానికి చెందిన కారం రాజు కుమారుడు కారం సంతు (28) అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీ చింతపంటి సత్యం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.మృతదేహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు తన వంతు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కల్తీ లక్ష్మయ్య, సుమన్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.