మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లి గ్రామంలో వెలిచిన శ్రీరాముని ఆలయంకు అయోధ్య నూతన శ్రీరాముని ఆలయం నుంచి ఆలయ కమిటీ వారు పంపిన తలంబ్రాలు లక్ష్మీపురం గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
500 ల సంవత్సరాల తర్వాత మన రాముడు మన ఇంట్లోకి రాబోతున్న శుభ సందర్భంలో అయోధ్యలో 22.01.2024 నాడు జరుగుతున్న శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయ కమిటీ వారు భారతదేశంలోని నలుమూలల గ్రామ గ్రామానికి పంపించినటువంటి శ్రీరాముని తలంబ్రాలను గ్రామస్తులందరూ ఇల్లు శుభ్రం చేసుకోని ఇంటింటికి పంచినటువంటి తలంబ్రాలను పవిత్రమైన ప్రదేశంలో దాచిపెట్టి 22వ తేదీ 11, గంటల నుండి 12:20 గంటల సమయం వరకు మన భారతదేశం మొత్తం ఈరోజున రెండోవ దీపావళిగా భావించడం జరుగుతుందనీ ఆయోధ్యలో జరగబోతున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరిగే సందర్భంలో ప్రతి ఒక్కరి ఇంట్లో 500 సంవత్సరాలకు గుర్తుగా 5 దీపాలు ఇంట్లో వెలిగించి అక్షింతలు శిరస్సు మీద ధరించి కొన్ని అక్షింతలు దాచుకొనండి ఇవి భవిష్యత్ తరాలకు ఇవి అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రుని తలంబ్రాలు మానవ జన్మ ధన్యంగా, శంఖం పూరించడం, గంట మోగించడం చేసి హిందువులంతా శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందాలని శ్రీ రాముని జన్మస్థలం అయోధ్య ఆలయ కమిటీ ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాలలు వేసిన వారు దగట్ల చిరంజీవి, వాసం కమల, రేగ కార్తీక్, గుండెబోయిన శరత్, మడప మధు, మడప పగడయ్య, తెల్లం నరసింహారావు, గొంది రాము పాల్గొన్నారు.