హీరోయిన్ మాళవిక మోహనన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనను అవమానించారని, తనతో రూడ్‌గా బిహేవ్ చేశారని చెప్పుకొచ్చింది. ఇండిగో సర్వీస్ బాగా లేదని ట్విట్ చేస్తూ.. ఇండిగో ఎయిర్‌లైన్స్ అఫిషియల్ అకౌంట్‌కు ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన ఇండిగో.. ‘ఇలా జరిగినందుకు చింతిస్తున్నాము. మేము చెక్ చేసి.. మళ్లీ మిమ్మల్ని సంప్రదిస్తాం’. అని రాసుకొచ్చారు.
